Salaar : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ క్యాస్టింగ్, అత్యన్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉండగా, తాజాగా చిత్రానికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ఒకటి లీకైంది. ఈ వీడియోలో ప్రభాస్‌తో చేతిలో గన్, చూట్టు సంచులను చూస్తుంటే ఇది హోరాహోరిగా సాగే ఫైట్ సీన్ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలోనూ సలార్ చిత్రానికి సంబంధించి పలు ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
మరి కొద్ది రోజులలో ప్రభాస్ బర్త్ డే రానుండగా, ఆ సినిమాకు సంబంధించి సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ ఈ లోపే చిత్రం నుండి ఇలా వీడియో లీక్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇక ఈ మూవీతోపాటు.. ప్రభాస్.. ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్సన్ మూవీ చేస్తున్నాడు. సందీప్‌తో కలిసి స్పిరిట్ అనే చిత్రం చేయనున్నారు.
https://twitter.com/PRABHASUPDATESS/status/1450312378755608578?s=20