Sajjanar : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సజ్జనార్ అనుక్షణం ఆర్టీసీ సేవలు ప్రతి ఒక్కరికీ చేరువ అయ్యే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆర్టీసీ గురించి పలు వీడియోలు, పోస్టులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆర్టీసీ సేవలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు తెరకెక్కుతుండడంతో ఆ సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే సజ్జనార్ ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ ను తనదైన శైలిలో ఉపయోగించుకుని వాటిని ఆర్టీసీ ప్రమోషన్ల కోసం వాడుతున్నారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా గురించి ఒక మీమ్ క్రియేట్ చేసి అందరి చేత ఆహా అనిపించారు. ఇదిలా ఉండగా తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా గురించి దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను సజ్జనార్ బీభత్సంగా వాడుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఎత్తర జెండా అనే పాటతో సజ్జనార్ ఆర్టీసీ సేవల గురించి ఒక వీడియో క్రియేట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
#TSRTC is at the Service of Public #RRR – రాష్ట్ర రోడ్డు రవాణా #TSRTCPublicService #EtharaJenda @TSRTCHQ @baraju_SuperHit @MilagroMovies @tarak9999 @ssrajamouli @AlwaysRamCharan @TarakFans @Chiru_FC @worldNTRfans @NTR2NTRFans @RRRMovie @AlwaysCharan_FC @TrackTwood @TV9Telugu pic.twitter.com/XybL6SDQWt
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2022
ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ టీఎస్ ఆర్టీసీ అని ఉన్న జెండాను ఎత్తినట్లు చూపించిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో RRR అంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని.. ఆర్టీసీలో ప్రయాణించండి.. సురక్షిత గమ్యాన్ని చేరండి.. అంటూ క్రియేట్ చేసిన వీడియోని పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈయన అద్భుతమైన ఐడియాకు హ్యాట్సాఫ్ చెప్పగా.. మరికొందరు.. ఇదేం వాడకం రా సామీ.. మామూలుగా వాడలేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.