Holi Festival : హిందూ పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా రంగులను ఒకరిపై ఒకరు చల్లుకోవడం వల్ల ప్రతి ఒక్కరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని భావిస్తారు. ఇలా ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగను ఎప్పుడు జరుపుకోవాలి ? శుభ ముహుర్తం ఎన్ని గంటలకు ఉంది ? ఈ పండుగ రోజు ఎలాంటి పూజలు చేయాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం 2022వ సంవత్సరంలో హోలీ పండుగ మార్చి 18వ తేదీన వచ్చింది. అయితే చోటీ హోలీ పండుగను పండుగకు ఒక రోజు ముందు అంటే మార్చి 17వ తేదీన జరుపుకుంటారు. హోలీ పండుగ సరైన ముహూర్తం తిథి విషయానికి వస్తే మార్చి 17 మధ్యాహ్నం1:29 గంటలకు ప్రారంభం అయ్యి మార్చి 18 మధ్యాహ్నం 12:47 గంటలకు ముగుస్తుంది.
ఇక ఈ పండుగ రోజు చేయాల్సిన పూజలు ఏమిటి అనే విషయానికి వస్తే.. హోలీ పండుగ రోజు పెద్ద ఎత్తున శ్రీకృష్ణ పరమాత్ముడికి పూజలు నిర్వహిస్తారు. అలాగే హోళికా దహనం జరిగిన రోజున ఈ పండుగను జరుపుకుంటారు కనుక ఈ పండుగ రోజు కొన్ని ప్రాంతాలలో రాత్రి పూట హోలికా దహనం చేస్తూ ఎంతో వేడుకగా పండుగను జరుపుకుంటారు.