జూలై 25వ తేదీన విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఓ వివాహిత అదృశ్యం అయిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది. పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస రావుతో కలిసి సాయి ప్రియ అనే యువతి బీచ్‌కు వెళ్లింది. అయితే ఉన్నట్లుండి ఆమె అక్కడ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె సముద్రపు అలలకు కొట్టుకుపోయి ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు బీచ్‌కు చేరుకుని అక్కడ ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది, హెలికాప్టర్, గజ ఈత గాళ్లతో ఆమె కోసం అంతటా గాలించారు. అయితే ఆమె మాత్రం వేరే ప్రాంతంలో ప్రియుడితో ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చింది.
గత రెండు మూడు రోజుల నుంచి సాయిప్రియ ఆచూకీ కోసం అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, భర్త కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఓవైపు అందరూ ఆమె కోసం ఆందోళన చెందుతుంటే.. ఆమె మాత్రం తన ప్రియుడితో కలిసి నెల్యూరులో ప్రత్యక్షమైంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నేవీ, కోస్ట్ గార్డ్, పోలీసులు, గజ ఈతగాళ్లు ఆమె ఆచూకీ కోసం ఎంతో సమయం పాటు వెదికారు. కానీ ఆమె మాత్రం ప్రియుడి వద్దకు చేరుకుంది. దీంతో ఆమెపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ వైపు నీ కోసం ఎంతో మంది ఆందోళన చెందుతుండగా.. నువ్వు అందరినీ ఇలా మోసం చేస్తావా.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎంతో మంది ప్రభుత్వ అధికారుల సమయాన్ని వృథా చేశావంటూ ఆమెపై మండిపడుతున్నారు. అయితే ఆమెపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సాయిప్రియ వార్త మాత్రం గత రెండు రోజులుగా సంచలనం సృష్టించింది. ఆమె నిజంగానే అలలకు కొట్టుకుపోయిందని చాలా మంది విచారం వ్యక్తం చేశారు కూడా. కానీ చివరకు ఇలా జరిగింది.