Sai Pallavi : గతంలో అంటే హీరోయిన్లు కేవలం హీరోయిన్ల పాత్రల్లోనే నటించేవారు. ఐటమ్ సాంగ్స్ చేసే నటీమణులు వేరే ఉండేవారు. ఇలా ఎవరి పని వారు చేసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకులు కొత్త కొత్త రుచులు కోరుకుంటున్నారు. కనుకనే హీరోయిన్లతోనూ మేకర్స్ ఐటమ్ సాంగ్స్ చేయిస్తున్నారు. ఈ ఫార్ములా కూడా బాగానే క్లిక్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేసి మెప్పించారు. పూజా హెగ్డె, కాజల్ అగర్వాల్, శృతి హాసన్, తమన్నా, సమంతా.. ఇలా చాలా మంది ప్రముఖ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్‌లో నటించి అలరించారు. అయితే స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నప్పటికీ సాయి పల్లవి మాత్రం ఐటమ్ సాంగ్స్‌లో అసలు నటించబోనని చెబుతోంది. ఆ సాంగ్స్ ను అసలు చేయనని అంటోంది. ఇక దీని వెనుక ఉన్న కారణాలను కూడా ఆమె చెప్పేసింది.
సినీ రంగంలో సాయి పల్లవికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆమె నటనలో మంచి మార్కులు కొట్టేసింది. డ్యాన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె డ్యాన్స్‌కు ఫిదా కాని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. కనుక ఈమె తలచుకుంటే ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు వెల్లువలా వస్తాయని చెప్పవచ్చు. కానీ సాయి పల్లవి అసలు ఐటమ్ సాంగ్స్ చేయనని అంటోంది. ఎందుకంటే ఆ సాంగ్స్‌లో వస్త్రధారణ భిన్నంగా ఉంటుంది. అది తనకు నచ్చదని.. అలాంటి దుస్తుల్లో తాను సౌకర్యంగా ఉండలేనని.. అలాంటప్పుడు డ్యాన్స్ ఎలా చేస్తానని ప్రశ్నించింది. కనుక ఎట్టి పరిస్థితిలోనూ ఐటమ్ సాంగ్స్ చేయబోనని తేల్చేసింది.
ఇక సాయిపల్లవి గతంలోనూ ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఫెయిర్ నెస్ యాడ్‌ను తిరస్కరించింది. తాను సహజసిద్ధంగా కనిపించాలని కోరుకుంటున్నానని.. కృత్రిమ అందం తనకు నచ్చదని చెప్పింది. కొన్ని కోట్లు ఇస్తామన్నా వారి ఆఫర్‌ను ఈమె సున్నితంగా తిరస్కరించింది. దీంతో ఈమె ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సాయిపల్లవి చివరిసారిగా శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నాని పక్కన నటించింది. అలాగే ఈమె నటించిన విరాట పర్వం మూవీ జూలై 1వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు గార్గి అనే మరో మూవీకి సైతం ఆమె సైన్ చేసింది. ఇందులో ఈమెదే లీడ్ రోల్ కాగా.. ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రం అని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…