Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్న విషయం విదితమే. అయితే ఆయన తన కుటుంబానికి మాత్రం తగినంత సమయాన్ని ఎల్లప్పుడూ కేటాయిస్తుంటారు. ఇక తాజాగా ఆయన తన మాజీ భార్య రేణు దేశాయ్, కొడుకు అకీరా నందన్, కుమార్తె ఆద్యలతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఈ ఫొటోను చూసిన పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడి కోసం పవన్, రేణులు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా.. వారు కలసి పోయారా.. అని ఆరాలు తీస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం తన భార్య అన్నా లెజినోవాతో కలసి ఉంటున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే రేణుకు విడాకులు ఇచ్చేశారు కనుక ఆమెతో ఉండడం కుదరదు. కానీ పిల్లల కోసం వీరు ఇలా అప్పుడప్పుడు కలుస్తుంటారు. దీంతో తాజాగా కూడా మరోమారు వీరు ఇలా కలిశారు. చూస్తుంటే అకీరా నందన్‌కు చెందిన ఏదైనా ప్రోగ్రామ్‌లో వీరిద్దరూ పాల్గొని ఉంటారని తెలుస్తోంది.
ఇక అకీరా నందన్ విషయానికి వస్తే.. అతని ఎత్తు ప్రస్తుతం 6 అడుగుల 2 అంగుళాలు. తండ్రి కన్నా ఎత్తు ఎక్కువ ఉండడమే కాదు.. ఆయన అడుగు జాడల్లోనూ అకీరా నడుస్తున్నాడు. మొన్నీ మధ్యే తన బర్త్ డే సందర్భంగా రక్తదానం చేశాడు. ఇక అకీరా మార్షల్ ఆర్ట్స్, సంగీతంలోనూ దిట్టే. ఇటీవలే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలోని కళావతి అనే సాంగ్‌ను అకీరా పియానోపై వాయించి అబ్బురపరిచాడు. దీంతో అకీరా టాలెంట్‌కు అందరూ ఫిదా అయ్యారు. అయితే చాలా రోజుల తరువాత పవన్, రేణు ఇద్దరూ ఇలా ఒకే వేదికపై కనిపించడంతో.. పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరి ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…