Sai Pallavi : సాయిపల్లవి నటనలోనే కాదు.. డ్యాన్సర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె గ్లామర్ రోల్స్ చేయనని స్పష్టంగా చెప్పేసింది. అలాంటి పాత్రలు ఉండే సినిమాలను తిరస్కరిస్తానని తెలియజేసింది. తనకు నటిగా మంచి గుర్తింపును తెచ్చే సినిమాలనే చేస్తానని చెప్పింది. అలాగే నటిస్తుంది కూడా. గ్లామర్ షో చేయనప్పటికీ సాయి పల్లవిది ప్రత్యేక శైలి. కనుక దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు కూడా. ఇక ఎలాంటి యాడ్స్‌లోనూ నటించనని ఇదివరకే సాయిపల్లవి స్పష్టం చేసింది. దీంతో ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిపోయింది.
కాగా సాయిపల్లవికి రూ.2 కోట్లు ఇస్తామని ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ వారు ఆఫర్ చేశారట. ఆ చానల్ వారు నిర్వహించే షోస్, సీరియల్స్, ఇతర కార్యక్రమాలను ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది చిన్న ఆఫర్ ఏమీ కాదు. రూ.2 కోట్లు అంటే తక్కువేమీ కాదు. కానీ సాయిపల్లవి ఈ ఆఫర్‌ను కూడా సున్నితంగా తిరస్కరించిందట. ఆ చానల్ వారు చేసే కార్యక్రమాలు ఏమిటో తెలియకుండా తాను వాటిని ఎలా ప్రమోట్ చేస్తానని.. ఆమె అడిగిందట. దీంతో వారు సమాధానం చెప్పలేకపోయారట. కనుక రూ.2 కోట్ల ఆఫర్‌ను కూడా ఆమె రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది.
ఇక సాయిపల్లవి ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇలాంటి ఓ ఆఫర్‌ను తిరస్కరించింది. ఓ ప్రముఖ ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్ తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తే భారీ మొత్తంలో ముట్టజెబుతామని ఆఫర్ ఇచ్చిందట. అయితే తాను సహజసిద్ధమైన అందానికే ప్రాధాన్యతను ఇస్తానని.. కనుక బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయలేనని స్పష్టంగా చెప్పేసింది. ఈ క్రమంలో ఆ ఆఫర్‌ను ఆమె వదులుకుంది. ఇప్పుడు మరోమారు తన వ్యక్తిత్వం ఏమిటో చాటి చెప్పింది. దీంతో సాయిపల్లవిని అందరూ అభినందిస్తున్నారు. కేవలం డబ్బుల కోసమే అందాల ప్రదర్శన చేసే హీరోయిన్లు అధికంగా ఉన్న నేటి తరుణంలో సాయిపల్లవి లాంటి వారు మన కళ్ల ఎదుట కనిపిస్తుండడం నిజంగా నమ్మబుద్ధి కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు సాయిపల్లవి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. అందుకనే ఆమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…