Nayanthara Marriage : గత 4 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న నయనతార, విగ్నేష్ శివన్‌ల జంట ఎట్టకేలకు వివాహ బంధం ద్వారా ఒక్కటైంది. గురువారం ఉదయం 10.24 గంటలకు వీరు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. విగ్నేష్ శివన్.. నయనతార మెడలో తాళి కట్టడం ద్వారా వీరు భార్యాభర్తలు అయ్యారు. ఈ క్రమంలోనే ఈ వివాహ వేడుకకు అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. వారు నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు.
కాగా తమ పెళ్లి సందర్భంగా ఈ జంట ఓ గొప్ప పనిచేశారు. రాష్ట్రంలో పలు ఎంపిక చేసిన ఆలయాలతోపాటు ఇతర చోట్ల మొత్తం కలిపి ఒక లక్ష మంది పేదలకు అన్నదానం చేశారు. కాగా వీరి వివాహ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, దర్శకుడు మణిరత్నం, సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సేతుపతి, సూర్య, కార్తి, జ్యోతిక, దర్శకులు మోహన్ రాజా, శివ, కేఎస్ రవికుమార్, అట్లీ, శరత్ కుమార్, రాధిక, ఎస్‌జే సూర్య, సంగీత దర్శకుడు అనిరుధ్‌లు హాజరయ్యారు. వీరు వధూవరులను ఆశీర్వదించారు.
ఇక నయనతార, విగ్నేష్ శివన్‌ల వివాహం సందర్భంగా పకడ్బందీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్‌లో వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు వీరి వివాహానికి హై సెక్యూరిటీ కల్పించారు. అలాగే 80 మంది బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నయన్ పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…