Sai Pallavi : నటిగా, డ్యాన్సర్‌గా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటిగానే కాదు.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా అందరిచే ప్రశంసలను అందుకుంటోంది. గతంలో ఓ ఫెయిర్‌నెస్ కంపెనీకి చెందిన యాడ్‌లో నటించబోనని చెప్పి అందరిచే భేష్ అనిపించుకుంది. ఇక ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి కూడా సాయిపల్లవిని అనేక సార్లు మెచ్చుకున్నారు. హీరోయిన్ అంటే అలా ఉండాలని అన్నారు.
సాయిపల్లవి ఐటమ్ సాంగ్స్ చేయబోనని ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే సినిమాల్లో గ్లామర్ రోల్స్‌ను కూడా చేయనని చెప్పేసింది. అయినప్పటికీ ఆమె డ్యాన్స్, నటనకు ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఎంతో మంది ఫాలోవర్లను కూడా సంపాదించుకుంది. ఇక సాయిపల్లవి ఎంబీబీఎస్ చేసిందన్న సంగతి తెలిసిందే. ఆమె జార్జియాలోని బిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివింది. అయితే విదేశాల్లో డాక్టర్ విద్యను చదివినవారు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాన్ని కూడా సాయిపల్లవి రాసి పాస్ అయింది. ఈ క్రమంలోనే ఆమె డాక్టర్ కూడా అయింది.
అయితే సాయి పల్లవి ఎంత గొప్ప డ్యాన్సరో అందరికీ తెలిసిందే. తన సినిమాల్లో ఆమె చేసే డ్యాన్స్‌ను చూసేందుకే చాలా మంది ఆమె మూవీలకు వెళ్తుంటారు.. అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాయిపల్లవి చేసే డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది. శరీరాన్ని ఎటు పడితే అటు విల్లులా వంచుతూ డ్యాన్స్ చేయగలదు. అయితే సాయిపల్లవి జార్జియాలో మెడిసిన్ చదువుతున్నప్పుడు అక్కడి యూనివర్సిటీలో ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసింది. అందులో ఆమె చేసిన డ్యాన్స్‌ను చూస్తుంటే నిజంగా రెండు కళ్లూ చాలడం లేదు. అంతలా ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఇక ఆమె డ్యాన్స్ చేసిన వీడియో పాతదే అయినప్పటికీ దీన్ని చాలా మంది చూడలేదు. ఈ క్రమంలోనే ఈ వీడియోను చూసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…