Sai Pallavi : పుష్ప 1 ది రైజ్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 ది రూల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా పుష్పలో బన్నీ తగ్గేదెలే మ్యానరిజంకు వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్ ను అనుకరిస్తూ సెబ్రెటీస్, క్రికెటర్లు కూడా ఇన్ స్టా రీల్స్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ కోసం మేకర్స్ గట్టి ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.
అయితే తాజాగా పుష్ప 2 సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏమిటా అప్‌డేట్ అంటే.. ఈ మూవీలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించనుందట. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర 10 నిముషాలు మాత్రమే ఉంటుందట. అదీ సెకండాఫ్ లో వస్తుంది. సాయి పల్లవి ఓ గిరిజన యువతిగా కనిపించనుందట. అల్లు అర్జున్ ఓ కీలకమైన సమాచారం కోసం ఆమె దగ్గరకు వస్తాడని, ఆ తర్వాత జరిగే విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెబుతున్నారు.

అయితే మొదట సాయి పల్లవి.. ఇంత చిన్న గెస్ట్ రోల్ లాంటి పాత్రకు ఒప్పుకోలేదని, కానీ మొత్తం ఆమెపై డిజైన్ చేసిన సీన్స్ చూసిన వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. అయితే దీని గురించి అఫిషియల్ సమాచారం ఏమీలేదు. అలాగే సాయి పల్లవి పాత్రకు ఓ పాట ఉంటుందని, అది మూవీకి హైలెట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా పుష్ప 2 సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో మొదలుకానుంది. సుకుమార్ అండ్ టీమ్ స్ర్కిప్ట్ మీద ఎక్కువ సమయం వెచ్చించడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక పుష్ప 2 ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో.. పుష్ప రాజ్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాడో చూడాలి.