Sai Pallavi : నేచురల్ నటి సాయిపల్లవి నటన, డ్యాన్స్ కి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత హీరోయిన్లందరూ తమ గ్లామర్ ను నమ్ముకుని సినిమాలు చేస్తుంటే.. సాయిపల్లవి మాత్రం తన టాలెంట్ ను నమ్ముకుని వరుస సినిమాలు చేస్తోంది. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది. ఫిదా చిత్రం నుండి సాయిపల్లవి సినిమాలకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో పలకరించగా.. అవి కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

అయితే రెండు భారీ విజయాల తర్వాత కూడా సాయిపల్లవి సైలెంట్ గా ఉండటం, కొత్త ప్రాజెక్ట్స్ కు కమిట్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు ఆమె పెళ్లికి రెడీ అవుతుందన్న రూమర్స్‌కు ఆజ్యం పోసినట్లైంది. సాయిపల్లవి నటించిన విరాట పర్వం షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా, సినిమా విడుదలపై క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రం విడుదల కోసం టాలీవుడ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉండగా త్వరలో సాయిపల్లవి పెళ్లి పీటలెక్కబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె ఇప్పటి వరకు ఎలాంటి కొత్త చిత్రాలను ప్రకటించలేదని టాలీవుడ్ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాయిపల్లవి చాన్నాళ్లుగా సైలెంట్‌గా ఉండడంతో ఆమె పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సాయిపల్లవి సన్నిహితులు స్పందిస్తూ అందులో నిజం లేదని అంటున్నారు. మంచి కథ తన దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేస్తోందని చెబుతున్నారు. అంతేకానీ తొందరపడి మూవీస్ కమిట్ కావొద్దని పల్లవి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భోళాశంకర్ లో మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ రోల్ ఆఫర్ చేస్తే సాయిపల్లవి సున్నితంగా తిరస్కరించింది. రాబోయే చిత్రాలలో తన పాత్రలు.. లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ మూవీస్‌ని మించి ఉండాలని సాయిపల్లవి కోరుకుంటోంది. కనుకనే సినిమాలను అంగీకరించేందుకు ఆమె అంత సుముఖంగా లేదని తెలుస్తోంది. ఇక సాయిపల్లవి తరువాత సినిమా ఎప్పుడు చేస్తుందో చూడాలి.