Sai Pallavi : శర్వానంద్, రష్మిక మందన్నలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. ఆడాళ్లూ మీకు జోహార్లు. ఈ సినిమా మార్చి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్, నటి సాయిపల్లవిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ సాయిపల్లవిని అభినందించారు.
సాయిపల్లవి ఒక గొప్ప నటి అని.. అలాగే ఆమె ఎంతో మంచి మనస్సు ఉన్న మనిషి అని.. మానవత్వం చూపిస్తుందని.. సుకుమార్ కొనియాడారు. ఆమె గతంలో ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో నటించబోనని తేల్చి చెప్పిందని.. తనకు అలాంటి యాడ్స్ చేయడం ఇష్టం లేదని చెప్పిందని.. వారు డబ్బు బాగా ఇస్తామన్నా ఆమె నో చెప్పిందని.. అన్నారు. అలాంటి గొప్ప మనిషి సాయిపల్లవి అని అన్నారు.
ఇక సాయి పల్లవిని సుకుమార్ లేడీ పవన్ కల్యాణ్ అని అన్నారు. దీంతో ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ప్రాంగణాన్ని మోత మోగించారు. కాగా సాయిపల్లవి ఈ మధ్యే నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు హిట్ అయ్యాయి. త్వరలో ఈమె విరాట పర్వం అనే సినిమాలో కనిపించనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…