Nagababu : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై యుద్ధం ఇంకా ముగియలేదు. ఏపీ మంత్రులు వర్సెస్ పవన్ అన్నట్లు ప్రస్తుతం పరిస్థితులు మరో మారు మారిపోయాయి. ఈ క్రమంలోనే నాగబాబు వరుస వీడియోలను రిలీజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్‌ను తొక్కేయడానికే ఆయన సినిమా భీమ్లా నాయక్‌ను అడ్డుకుంటున్నారని.. ఆయన తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇక మళ్లీ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరల విషయంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తుందని.. ఇది సరికాదని.. త్వరగా సమస్యను పరిష్కరించాలని.. కొత్త జీవోను త్వరగా విడుదల చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తన యూట్యూబ్ చానల్‌లో మళ్లీ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఈ మధ్య కాలంలో కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఏపీలో థియేటర్లలో 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీని 100 శాతానికి చేశారు. థియేటర్లలో ఉన్న నిబంధనలను ఎత్తేశారు. కానీ టిక్కెట్ల ధరల విషయంలోనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య చిరంజీవి పలువురు హీరోలు, దర్శక నిర్మాతలతో వెళ్లి సీఎం జగన్‌ను కలిశాక ఒక వారం, పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు కష్టాలు ఎదురవుతున్నాయి. అందుకనే నాగబాబు స్పందించారు.
టిక్కెట్ల ధరల విషయంలో ఇంకా కొత్త జీవోను ఎందుకు విడుదల చేయలేదని నాగబాబు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే విడుదల చేస్తే జీవోను విడుదల చేయండి.. లేదంటే ఏపీలో తెలుగు సినిమాలను బ్యాన్ చేయండి.. అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రులకు సినిమా అంటే ఏమిటో తెలియదని.. సినిమాటోగ్రఫీ మంత్రి నానిని హీరోగా పెట్టి సినిమాను తీయాలని అన్నారు. తెలుగు సినిమాలు ఇప్పటికే చాలా వరకు నష్టపోయానని.. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…