Sai Dharam Tej : మెగా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఈయన చివరిసారిగా మనకు రిపబ్లిక్ మూవీ ద్వారా తెరపై కనిపించారు. తరువాత యాక్సిడెంట్ కారణంగా అనేక రోజుల పాటు హాస్పిటల్‌కే పరిమితం అయ్యారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక కూడా తేజ్ బయట మీడియాకు కనిపించేందుకు చాలా రోజుల సమయమే తీసుకున్నాడు. ఇక ఇటీవల వినోదయ సీతం అనే సినిమా ద్వారా మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించేశాడు. అయితే ఈ మూవీలో పవన్ దే కీలక రోల్. కనుక ఇది పవన్ సినిమానే అని చెప్పవచ్చు. తేజ్‌ది కేవలం సహాయక పాత్ర మాత్రమే. కనుక తేజ్‌కు ఇది మెయిన్ మూవీ కాదు. ఈ క్రమంలోనే తేజ్ తాను హీరోగా స్ట్రెయిట్ సినిమాను ఎప్పుడు చేస్తారా ? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తేజ్ ఇతర మెగా హీరోలకు భిన్నం. డిఫరెంట్ జోనర్‌లు, కథలను చేయడంలో దిట్ట. అలా చేసిన మూవీలు హిట్ అయ్యాయి కూడా. అయితే యాక్సిడెంట్ వల్లనో ఏమో తెలియదు కానీ.. తేజ్ చాలా డల్ అయినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ మంచి ఫామ్‌లోకి రావాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అదే పాత ధోరణితో తీసిన ఆచార్య మూవీ ఫెయిల్ కావడంతో తేజ్ అలాంటి తప్పు చేయవద్దని.. పాత స్టోరీలతో సినిమా తీయవద్దని.. తీస్తే గుణపాఠం అవుతుందని అంటున్నారు. భిన్నమైన కాన్సెప్ట్‌తో కూడిన కథలను ఎంచుకుని సినిమాలను తీయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక ప్రస్తుత తరుణంలో సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి, విశ్వక్‌సేన్ లాంటి వారు తమదైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు. అలా తేజ్ చేయాలని.. లేదంటే కెరీర్‌లో ముందుకు సాగడం కష్టమే అవుతుందని అంటున్నారు. మరి తేజ్ తన సొంత చిత్రం ఎప్పుడు ప్రారంభిస్తాడో చూడాలి.