Saamanyudu Movie Review : తెలుగు తెరకు విశాల్ బాగా పరిచయమే. ఈయన నటించిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తుంటారు. గతంలో ఈయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ హిట్ అయ్యాయి. ఇక ఈ వారం విశాల్ సామాన్యుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా..!
కథ..
పోరస్ (విశాల్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. పోలీసు కావాలని కలలు కంటుంటాడు. తన తండ్రి పోలీస్‌గా పనిచేస్తుంటాడు. అయితే ఆయన తన ఉన్నతాధికారుల ఆర్డర్స్‌ను కచ్చితంగా ఫాలో అవుతుంటాడు. ధనికులను అరెస్టు చేసేందుకు భయపడుతుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు అకస్మాత్తుగా పోరస్ సోదరి ద్వారక (రవీనా రవి) ని ఎవరో చంపేస్తారు. దీంతో పోరస్ తన సోదరిని చంపిన వారి కోసం వెదుకుతుంటాడు. ఇక మరోవైపు అన్వర్ (బాబురాజ్) ఎంపీ కావాలనుకుంటాడు. కానీ అతన్ని పరిశుద్ధం (కుమరవెల్) అడ్డుకుంటాడు. ఈ క్రమంలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ద్వారకను చంపింది ఎవరు ? దోషిని పోరస్ పట్టుకున్నాడా ? ద్వారకకు ఓ ధనిక వ్యక్తికి సంబంధం ఏమిటి ? పఓరస్ పోలీస్ అయ్యాడా ? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ఈ మూవీలో విశాల్ సరసన డింపుల్ హయతి హీరోయిన్‌గా నటించింది. యోగి బాబు, బాబురాజ్ జాకోబ్, పీఏ తులసి, రవీనా రవిలు ఇతర కీలకపాత్రల్లో నటించారు. అందరూ తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. విశాల్ సినిమాలు అంటే సహజంగానే యాక్షన్‌కు పెద్ద పీట వేస్తారు. ఇందులోనూ పలు యాక్షన్ సన్నివేశాలను చూడవచ్చు. అవి ప్రేక్షకులను అలరిస్తాయి. విశాల్ ఈ మూవీలో మరోసారి చక్కని పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
డింపుల్ హయతి ఫర్వాలేదనిపించింది. విశాల్ సోదరిగా రవీనా రవి నటన బాగుంది. మిగిలిన నటీనటులు కూడా బాగానే నటించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే అని చెప్పవచ్చు.
ఈ సినిమాకు చెందిన కథ, స్క్రీన్ ప్లే బాగానే ఉన్నా.. కథను మరీ నెమ్మదిగా చెబుతారు. దీంతో ఓపిగ్గా చూడాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో చాలా స్లోగా సాగుతుంది. కానీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌లో కొన్ని అవసరం లేని సన్నివేశాలను జోడించారు. ఈ మూవీ రన్ టైమ్ కూడా ఎక్కువే.
దర్శకుడు తు పా శరవనన్ సామాన్యుడుకు స్టోరీని అందించారు. మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకుని ఆయన కథ ఇచ్చారు. ఫైట్ సన్నివేశాలు బాగుంటాయి. కెవిన్ రాజ్ విజువల్స్ కూడా అలరిస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. విశాల్ ఈ మూవీలో మరోమారు పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. యోగిబాబు కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. చివర్లో సస్పెన్స్ ఉత్కంఠను కలిగిస్తుంది. ఇక మొత్తంగా చెప్పాలంటే.. విశాల్ సామాన్యుడు మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనే చెప్పవచ్చు. యాక్షన్, కామెడీ, సస్పెన్స్ కోరుకునే వారు ఈ మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…