Heroines : తెలుగు తెరపై రాణించిన ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం పలు ఇతర భాషల చిత్రాల్లోనూ నటిస్తూ పాపులర్ అయ్యారు. కొందరు టాలీవుడ్ కు దూరమైన ఇతర భాషల చిత్రాల్లోనే నటిస్తుండగా.. కొందరికి అవకాశాలు రావడం లేదు. కొందరు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే ఈ హీరోయిన్లందరూ ఎంత వరకు చదువుకున్నారో, వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
అరుంధతి చిత్రం ద్వారా ఎంతో పాపులర్ అయిన నటి అనుష్క శెట్టి బాహుబలి మూవీతో అలరించింది. ఈమెకు ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. ఈమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో బీసీఏ (బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) పూర్తి చేసింది.
లేడీ సూపర్ స్టార్‌గా పేరుపొందిన నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఈమె నటించిన కాతువాకుల రెండు కాదల్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈమె తిరువల్లలోని మర్తోమా కాలేజీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది.
పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రష్మిక మందన్న. ఈమె పుష్ప రెండో పార్ట్‌తోపాటు పలు బాలీవుడ్ మూవీల్లోనూ ప్రస్తుతం నటిస్తోంది. ఈమె కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేయగా.. ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లిష్ లిటరేచర్‌లలో నాలుగేళ్ల సర్టిఫికేషన్ విద్యను పూర్తి చేసింది.
పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా పాపులర్ అయిన సమంత ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాదిలో ఈమె నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక సమంత చెన్నైలోని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. అలాగే చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్‌లో కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని సాధించింది. ఫిలిం మేకర్ రవి వర్మన్ సహాయంతో ఈమె తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది.
తాప్సీ ఢిల్లీలో పుట్టి పెరిగింది. గురు తెగ్ బహదూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈమె కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించింది.
పూజా హెగ్డె ముంబైలో పుట్టి పెరిగింది. ఈమె అక్కడి ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్‌లో పీజీ చేసింది. 2010లో మిస్ యూనివర్స్ ఇండియా కాంపిటీషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2012లో సినిమా కెరీర్‌ను ప్రారంభించింది.
కాజల్ అగర్వాల్ కిషిన్ చంద్ చెల్లారం కాలేజ్‌లో మాస్ మీడియా, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఎంబీఏ చదవాలని ఈమె ప్రస్తుతం ఆలోచిస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ న్యూఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో ఉన్న జీసస్ అండ్ మేరీ కాలేజ్‌లో ఈమె మాథ్స్‌లో హానర్స్ డిగ్రీని పూర్తి చేసింది.
తమన్నా ముంబైలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషణ్ ట్రస్ట్ స్కూల్‌లో పాఠశాల విద్యను చదివింది. ముంబైలోని నేషనల్ కాలేజ్‌లో డిస్టన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆర్ట్స్‌లో డిగ్రీని పూర్తి చేసింది.
కీర్తి సురేష్ చెన్నైలో జన్మించింది. పెరల్ అకాడమీలో ఈమె ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. స్కాట్లండ్‌లో ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌కు హాజరైంది. లండన్‌లో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…