RRR Movie : ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్, సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా.. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితలు కుదుట పడడంతో సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఎన్టీఆర్, రామ్ చరణ్ పూర్తి చేశారట. ఎన్టీఆర్.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను తానే చెప్పుకోవడం విశేషం.
రామ్ చరణ్.. తెలుగు, హిందీ, తమిళంలో మాత్రమే తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం. అటు అజయ్ దేవ్‌గణ్, ఆలియాతో పాటు మిగతా నటీనటులు ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డారట. సినిమా ఫైనల్ వర్క్స్ అన్నీ పూర్తి అయిన నేపథ్యంలో చిత్ర టీజర్‌ని దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. దీపావళి రోజున ప్రమోషన్స్ మొదలు పెట్టి.. ఆ తర్వాత మూవీపై అంచనాలు పెంచే కార్యక్రమాలను వేగంగా చేయాలని.. నిర్మాతలు భావిస్తున్నారట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…