Roshan : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది సినీ వారసులు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి తనదైన శైలిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రోషన్ మరో మూవీ రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో పెళ్లిసందD సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ తను బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించి సూపర్ హిట్టయిన “దబాంగ్ త్రీ” సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారని రోషన్ తెలియజేశారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదని ఈ సందర్భంగా రోషన్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా త్వరలోనే తన తమ్ముడు రోహన్ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడనే ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటికే రోషన్ కి సంబంధించిన కథ సిద్ధమవుతోందని, తన తమ్ముడు రోహన్ ను ఇండస్ట్రీలోకి డైరెక్టర్ ప్రభుదేవా లాంచ్ చేయబోతున్నారని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేయనున్నట్లు రోషన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే పెళ్లిసందD సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…