Balakrishna : నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. సినిమాల్లో అయినా రియల్ లైఫ్‌లో అయినా బాలకృష్ణ పంథా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే ఒక షో చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ షోలో సింగిల్ పర్సన్స్ కాకుండా ఫ్యామిలీలను ఇంటర్వ్యూ చేయనున్నారట.
తొలి ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీతో బాలకృష్ణ ఇంటర్వ్యూ ఉండబోతోందని అంటున్నారు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి అతిథులుగా ఈ షో ఆసక్తికరంగా బాలయ్య నడిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా అల్లు అరవింద్ చిరంజీవి, రామ్ చరణ్ లని ఈ షోకు అతిథులుగా వచ్చేలాగా చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆహా కోసం ఓ సారి చిరంజీవిని సమంత ఇంటర్వ్యూకి తీసుకొచ్చారు అల్లు అరవింద్.
బాలయ్యకు, చిరంజీవికి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సవంలో కూడా చిరంజీవి పాల్గొని బాలకృష్ణకు తన విషెస్ అందించారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్ షో కోసం చిరంజీవి తన తనయుడితో కలిసి రాబోతున్నారట. ఆయన ఇందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇదే కనుక జరిగితే షో దద్దరిల్లి పోవడం ఖాయం.. అని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…