Romantic Movie Review : తెలుగు చిత్రసీమలో ఎంతో మంది హీరోలను స్టార్స్‌గా మార్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ పూరీని కూడా మంచి హీరోగా నిలబెట్టాలని ఎంతో కృషి చేస్తున్నాడు. ‘మెహబూబా’ చిత్రంతో ఆకాష్‌ను మంచి మాస్ హీరోగా తెరకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు పూరీ. ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఇప్పుడు తన శిష్యుడి దర్శకత్వంలో రొమాంటిక్ అనే సినిమా రూపొందించాడు పూరీ.
రొమాంటిక్ చిత్రానికి కథ అందించడంతోపాటు స్వయంగా నిర్మించారు పూరీ. ఈ సినిమాతోనే కేతిక శర్మను కథానాయికగా.. అనిల్ పాదూరిని దర్శకుడిగా తెరకు పరిచయం చేశారు. సినిమా గోవాలో ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మధ్య వార్ నేపథ్యంలో సాగుతుంది. వాస్కోడిగామా (ఆకాష్ పూరి) ఓ అనాథ. తన లాంటి అనాథల కోసం ఇళ్లు కట్టించాలని చిన్నప్పుడే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే డబ్బు సంపాదన కోసం నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు.
నాన్నమ్మ మేరీ (రమా ప్రభ) దగ్గర బస్తీలో పెరుగుతాడు. తినడానికి తిండి.. ఉండటానికి ఇల్లు లేని ఆ బస్తీ వాళ్లకి ఏదైనా చేయాలనే సంకల్పంతో రాంగ్ వేలో డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. తన ఆశయం నెరవేర్చుకోవడం కోసం.. గ్యాంగ్ స్టర్‌గా మారతాడు. ఈ క్రమంలోనే తన తండ్రి చావుకి కారణమైన పోలీస్ అధికారిని చంపేస్తాడు. అతన్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ రమ్య గోవరికర్ (రమ్యకృష్ణ). వాస్కోడిగామా ఆగడాలకు రమ్య అతనికి ఎలా కళ్లెం వేసింది అని ఆసక్తికరంగా చూపించారు.
పోకిరి, ఇడియట్, దేశముదురు, రోగ్, లోఫర్, హార్ట్ ఎటాక్, 143 ఈ సినిమాలన్నింటినీ మిక్స్ కొట్టినట్టుగానే కథ అనిపించినా.. ఎక్కడా బోర్ కొట్టకుండా రేసీ స్క్రీన్ ప్లేతో రొమాంటిక్‌ని ముందుకు నడిపించారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఈ సినిమా స్థాయిని పెంచింది. ‘రొమాంటిక్’ సీన్లతోపాటు యాక్షన్ ఎపిసోడ్‌కి కశ్యప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నటీనటుల పర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ చిత్రం పక్కాగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెప్పాలి.
ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, కథణం, స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పూర్తిగా ఆయన సినిమాలాగే అనిపిస్తుంది. పూరీ గత సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, ఈసినిమాలోనూ అలానే ఉంటాడు. `కర్‌లో యా మర్‌లో` అనే తత్వం హీరోది. లాజిక్‌లను పక్కనపెట్టి.. మ్యాజిక్‌ని నమ్ముకునే పూరీ.. ఇందులో కూడా తనకు తగినట్లుగా సీన్స్ రాసుకున్నాడు. ప్రతి సీన్‌లోనూ, డైలాగ్స్‌లోనూ పూరీ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వినోదం కోసం అయితే ఈ మూవీని ఒకసారి చూడొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…