Puneeth Rajkumar : కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా గుండెపోటుకు గురవ్వడం సినీ ప్రముఖులను కూడా ఎంతగానో కలచివేసింది. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర సినీ ప్రముఖులు అందరూ పునీత్ రాజ్ కుమార్ మృతిపై తీవ్రస్థాయిలో దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
పునీత్ తండ్రి కూడా గుండెపోటుతో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన తనయుడు కూడా గుండెపోటుతో మరణించడంతో కన్నడిగులు శోకసంద్రంలో మునిగారు. సినిమాలే కాదు.. సామాజిక సేవల్లోనూ ముందున్నాడు పునీత్. ఆయన 26 అనాథ ఆశ్రమాలను నడిపిస్తున్నాడు. 16 ఓల్డేజ్ హోం లను నిర్వహిస్తున్నాడు. 1800 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాడు. అంతేకాదు.. తను చనిపోవడానికంటే ముందే తన కళ్లను దానం చేసి గొప్ప మనసున్న మనిషి అని నిరూపించుకున్నాడు.
పునీత్ రాజ్‌కుమార్‌ను తన అభిమానులు ప్రేమగా అప్పు అనే పిలుచుకుంటారు. తాను నటించిన ‘అప్పు’ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇది తెలుగులో రవితేజ నటించిన ఇడియట్ సినిమాకు రీమేక్. దీనిని కన్నడలో డైరెక్ట్ చేసింది కూడా పూరీ జగన్నాథే. తన డెబ్యూకు ఇలాంటి కథే కరెక్ట్ అనుకున్న పునీత్.. అప్పుగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పు మరణంతో కన్నడిగులు తెగ ఎమోషనల్ అవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…