Romantic Movie : పూరీ జగన్నాథ్ తనయుడు .. ఆకాష్ పూరీ, కేతిక శర్మ ప్రధాన పాత్రలలో రూపొందిన లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’ . ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. రొమాంటిక్ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో రూ.1.5 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా రెండో రోజు రూ.60-70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని భావించగా.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొట్టింది. రొమాంటిక్ రెండో రోజు రూ.83 లక్షల వరకు షేర్ సాధించింది. సినిమా రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ రూ.4.6 కోట్లు అయ్యాయి. ఈ సినిమా రూ.5 కోట్ల రేంజ్‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ సినిమా 2 రోజుల్లో రూ.2.48 కోట్ల షేర్‌ను సాధించింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.2.52 కోట్ల షేర్‌ని అందుకోవాల్సి ఉంది.
రొమాంటిక్.. సినిమాకు యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది. ఆకాష్ పూరీ, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించింది. రమ్యకృష్ణ చిత్రంలో ఆకాష్ పూరీకి అత్త పాత్రలో కనిపించింది. వీరితోపాటు హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాల పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…