Rajnikath : సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రతిష్టాత్మక `దాదా సాహెబ్ ఫాల్కే` అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా రజనీకాంత్ అటు ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిశారు.
ఢిల్లీ నుండి వచ్చాక రజనీకాంత్‌కి ఒంట్లో నలతగా అనిపించడంతో కావేరీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయన్ని పరిశీలించి మెదడులోని నరాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి చికిత్స అందించారు. కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. రజనీ ఓకే చెప్పడంతో వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించారు. అది విజయవంతం కావడంతో ఆసుపత్రిలో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తలైవా ఆదివారం రాత్రి ఇంటికి వచ్చారు.
నా చికిత్స పూర్తయ్యింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు పడాలని ప్రార్థనలు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అని రజనీకాంత్ పేర్కొన్నారు. రజనీకాంత్ లేటెస్ట్ మూవీ అన్నాత్తె (పెద్దన్న) దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. తలైవర్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…