Roja : టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది నటి రోజా. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. పొలిటికల్ ఫీల్డ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రోజా సొంతం. రోజా రాజకీయ రంగంలో ఉంటూనే మరోపక్క బుల్లితెర షోస్ అయిన జబర్దస్త్ వంటి కామెడీ షోలలో జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. రోజా మంత్రి అయ్యాక.. పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించింది. అయితే రోజా ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి చెబుతూ నెట్టింట్లో పోస్టులు చేస్తుంటుంది.
ఇక రోజా తన కూతురు అన్షు మాలిక చిన్న వయసులో ఎంతో ఎత్తుకు ఎదిగింది. పుస్తకాలు రచిస్తోంది. ప్రపంచ స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకుంటోంది. తనకు చేతనైన సాయం అందించడంలో అన్షు మాలిక ముందుంటుంది. ఓ ఇద్దరిని చదివిస్తోంది. ఇలా తన కూతురి గురించి చెబుతూ రోజా ఎంతో గర్వపడుతుంటుంది. అయితే శనివారం అన్షు మాలిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా అన్షు మీద ప్రేమను కురిపించింది రోజా. డియర్ అన్షు.. నువ్వు నా కూతురివే కాదు.. మంచి ఫ్రెండ్‌వి.. నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నందుకు థాంక్స్.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్షు అంటూ ప్రేమగా పోస్ట్ వేసింది.

మామూలుగా అయితే ప్రతి ఏడాది గ్రాండ్‌గా బర్త్ డేను సెలెబ్రేట్ చేస్తుంటుంది రోజా. అయితే ఈ సారి మాత్రం సింపుల్‌గా తన కూతురికి విషెస్ చెప్పేసింది. అయితే రోజా కుమార్తె అన్షు మాలిక వెండి తెరంగ్రేటం చేయనుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అన్షును హీరోయిన్‌గా చేసేందుకు రోజా ప్రయత్నిస్తోందన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అన్షు మాలిక ఇప్పటికే యూఎస్ లోని ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు రావడంతో అక్కడ శిక్షణ పొందుతోంది. అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆమె సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. రోజా కూతురు అన్షు సినిమా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చూడాలి.