Richa Gangopadhyay : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా తక్కువ కాలం పాటు కొనసాగుతారు. కేవలం కొందరు మాత్రం కాస్త ఎక్కువ కాలం పాటు ఉంటారు. వారు అయినా సరే ఎప్పుడు ఒకప్పుడు పెళ్లి చేసుకోక తప్పదు. ఇక కొందరైతే చాలా తక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో ఉంటారు. ఆ తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. వారు ఇక సినిమాల వైపే చూడరు. అలాంటి వారిలో నటి రిచా గంగోపాధ్యాయ ఒకరని చెప్పవచ్చు. ఈమె వివాహం అయ్యాక అసలు సినిమా ఇండస్ట్రీ వైపే చూడడం లేదు. కానీ ఈమెకు చెందిన లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
రిచా గంగోపాధ్యాయది న్యూఢిల్లీ. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. తరువాత ఇండియాకు వచ్చింది. 2007లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని కూడా సాధించింది. ఆ తరువాత ఆమె నటనపై దృష్టి పెట్టింది. ముందుగా మోడల్ అయింది. ఈ క్రమంలోనే ఆమెకు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అలా ఆమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా పక్కన లీడర్ సినిమాలో యాక్ట్ చేసింది. ఆ మూవీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నా ఈమెకు మాత్రం అవకాశాలు బాగానే వచ్చాయి.

అనంతరం వెంకటేష్‌తో కలిసి నాగవల్లి మూవీలో యాక్ట్ చేసింది. అయితే ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తరువాత రవితేజతో కలిసి మిరపకాయ్ అనే మూవీలో నటించగా.. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో ఆమె గ్లామర్ డోసు కాస్త ఎక్కువైందనే చెప్పాలి. ఆ తరువాత తమిళంలో ధనుష్‌తోనూ నటించింది. ఇక రిచా గంగోపాధ్యాయకు మిర్చి మూవీ ఇంకా ఎక్కువ పేరు తెచ్చి పెట్టింది. అందులో ఈమె ప్రభాస్ సరసన నటించింది. ఆ తరువాత 2013లో భాయ్ అనే మూవీలో నాగార్జున పక్కన నటించగా.. ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తరువాత ఈమె సినిమా ఇండస్ట్రీని పూర్తిగా విడిచిపెట్టింది. అమెరికాకు చెందిన జో లాంజెల్లా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తరువాత చాలా తక్కువ సార్లు మాత్రమే ఈమె కనిపించింది.
ఇక రిచా గంగోపాధ్యాయకు చెందిన లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుండడంతో ఈమె ఇప్పుడు ఇంతలా మారిపోయిందేమిటి.. అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే కొందరు నెటిజన్లు ఆమె ఫొటోలకు కామెంట్లు కూడా పెడుతున్నారు. మీరు మళ్లీ సినిమాల్లోకి రావాలని కోరుతున్నారు. అయితే వారి రిక్వెస్ట్‌ను ఈమె ఒప్పుకుంటుందా.. లేదా.. అన్నది చూడాలి.