Rice Husk Powder : మనిషి ఆరోగ్యంగా జీవించడానికి పోషక విలువలు కలిగిన ఆహారం అత్యంత అవసరం. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటితోపాటు మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వలన కూడా అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మన శరీరం దృఢంగా ఉండాలంటే నిత్యం వ్యాయామంతోపాటు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇప్పుడు మనకు అనేక పోషకాలను అందించే అత్యంత న్యూట్రిషన్స్ కలిగిన అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది తవుడు గురించి వినే ఉంటాం. తవుడును ఎక్కువగా పశువులకు దాణాగా ఉపయోగిస్తారు. కానీ దీనిలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే తప్పకుండా మీరు కూడా తవుడును ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. 100 గ్రాముల తవుడుని తీసుకుంటే 316 క్యాలరీల శక్తి లభిస్తుంది. అంటే ఇది చికెన్, మటన్ కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. జంతువులకు తవుడు పెట్టి మనం మాత్రం పోషకాలు లేని తెల్లని బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నాం.
ఇందులో 14 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ 50 గ్రాములు, ఫ్యాట్ 20 గ్రాములు, ఫైబర్ 21 గ్రాములు ఉంటుంది. అందువల్లనే తవుడు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ తీస్తారు. తెల్లని బియ్యంలో ఒక గ్రాము ఫైబర్ కూడా ఉండదు. ఈ క్రమంలోనే పేగుల శుభ్రతకు, పేగులలో మంచి బాక్టీరియా పెరుగుదలకు, మలబద్ధకం రాకుండా చేయడానికి తవుడులో ఉండే ఫైబర్ బాగా సహాయపడుతుంది.
తవుడులో 35 నుంచి 45 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. తవుడులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తం తక్కువగా ఉండేవారు ఐరన్ ట్యాబ్లెట్లకు బదులుగా తవుడును ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా ఎముకల దృఢత్వానికి కాల్షియంతోపాటు ఫాస్పరస్ కూడా చాలా అవసరం. ఇందులో దాదాపుగా1677 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 1485 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది.
మెగ్నిషియం 781 మిల్లీ గ్రాములు, రక్షణ వ్యవస్థకు కావాల్సిన జింక్ 8 మిల్లీ గ్రాములు ఉంటుంది. రక్షణ వ్యవస్థకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే సెలీనియం15.6 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా తవుడులో పుష్కలంగా లభిస్తాయి. అందువలనే తవుడును శరీరానికి కావలసిన పోషకాల గని అంటారు. ఇలాంటి తవుడు రైస్ మిల్లులలో బాగా లభిస్తుంది. ఈ క్రమంలోనే తవుడును పుల్కా లాంటి వాటిలోనూ, కొంచెం పొడి అన్నంలోనూ కలుపుకొని తినవచ్చు. దీంతో పైన తెలిపిన విధంగా అనేక లాభాలను పొందవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…