RGV : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశాలలో భాగంగా సభ నుంచి వాకౌట్ అవుతూ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు సభలో తమను ఎంతో అవమానించారని తనని మాత్రమే కాకుండా తన భార్యను కూడా అవమానించారని వెల్లడించారు.
40 సంవత్సరాల అనుభవం ఉన్న తనకు ఈ విధమైన అవమానం ఎదురవడంతో సభ నుంచి వాకౌట్ చేస్తూ.. తిరిగి సీఎం అయిన తరువాతనే సభలోకి అడుగుపెడతానని.. చంద్రబాబు శపథం చేసి వెళ్ళారు. సభ నుంచి వాకౌట్ అయిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. భోరున విలపించారు. ఇలా చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్వడంపై కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. తన దైన శైలిలో సెటైర్లు వేశారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తాను రూపొందించిన పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్ అనే ట్రైలర్ చూసే.. చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు.. అంటూ కామెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏడుస్తున్న క్లిప్ కట్ చేసి.. ఆయనే మాట్లాడుతున్నట్టుగా ఒక మిమిక్రీ వాయిస్ క్రియేట్ చేసి.. ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ చూడటం జరిగింది.. దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు’ అంటూ.. చంద్రబాబు నాయుడు ఏడుస్తున్న వీడియోను షేర్ చేశారు.
అదేవిధంగా ఇందాకే బాబు ఈ ట్రైలర్ చూశారు.. ఆయన స్పందించిన తీరుకి ధన్యవాదాలు.. అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు ఆర్‌జీవీ వాడకం మామూలుగా లేదుగా అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…