Rashmika Mandanna : ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రష్మిక ప్రస్తుతం ఫలు భాషలలో సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. హిందీలోకి ఎంట్రీ ఇచ్చాక రష్మిక డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారింది. పొట్టి దుస్తులలో ఈ అమ్మడి రచ్చ చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్ హీరోయిన్స్ కేటగిరీలోకి చేరిపోయింది రష్మిక. ‘సరిలేరు నీకెవ్వరు’ .. ‘భీష్మ’ సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమా చేస్తోంది. ఒక వైపున తెలుగులో స్టార్ హీరోయిన్ గా తన దూకుడును కొనసాగిస్తూనే మరో వైపున తమిళ .. హిందీ భాషల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అయితే రష్మికకి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ‘ది రష్మిక మీల్’ పేరుతో ప్రత్యేక మీల్ కేటగిరిని రూపొందించింది. రష్మిక ఇష్టపడే ఐటమ్స్ తో కూడిన మీల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
‘ది రష్మిక మీల్’ ప్యాకేజ్ లో మెక్ స్పైసీ .. ఫ్రైడ్ చికెన్ .. మెక్ స్పైసీ చికెన్ బర్గర్ .. పెరి పెరి ఫ్రైస్ .. నింబూ ఫిజ్ .. మెక్ ఫ్లర్రి ఉంటాయి. ఫుడ్ విషయంలో రష్మిక ఎక్కువగా ఏం ఇష్టపడుతుందో తెలుసుకోవాలనే అభిమానులకు ఇప్పుడు ఆ జాబితా ఏమిటో తెలిసిపోయింది.
ఇక వాటి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చునన్నమాట. దీనిపై రష్మిక మాట్లాడుతూ .. “జీవితంలో పెద్ద .. చిన్న సక్సెస్ లను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నా మెక్ డొనాల్డ్స్ ఫేవరేట్స్ ను అందరితో కలిసి పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…