RGV : ప్రస్తుతం టాలీవుడ్‌లో వర్మ, నట్టి కుమార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఆర్జీవీపై నట్టి కుమార్ చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆర్జీవీ వివరణ ఇస్తూ ట్విటర్‌లో వీడియో రిలీజ్ చేశాడు. నట్టి కుమార్ నోటీసులకు నా అడ్వకేట్ సమాధానం ఇస్తాడు. ఇక నాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసు. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వాళ్ళని వీళ్ళని తిట్టడం తప్ప అతని లైఫ్‌లో ఏం లేదని అనుకుంటున్నా.. అంటూ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో నట్టి కుమార్ తాజాగా స్పందిస్తూ వర్మని ఏకి పారేశాడు.
ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్ వర్మ ఇప్పుడు ఛీటింగ్ వర్మగా మారారు. చాలా మందికి డబ్బులు ఎగ్గొట్టాడు. ఎవరైనా డబ్బులు అడుగుతుంటే తప్పించుకుని తిరుగుతున్నాడు. రోజుకొకరిని అడ్డు పెట్టుకున్నాడు. మొన్నటి వరకు తుమ్మల ప్రసన్నకుమార్‌ను అడ్డు పెట్టుకున్నాడు. ఇప్పుడు రామ సత్యనారాయణ అనే బ్రోకర్‌ను అడ్డు పెట్టుకున్నాడు. ఛాంబర్ నా చేతిలో ఉందిగా డబ్బులు ఎగ్గొడతాం అన్నట్లు ప్రవరిస్తున్నాడు. ముంబైలో నా ఆఫీసు ఖరీదు ఐదు వందల కోట్లు అని అన్నాడు. దానికి రెంట్ కట్టక రాత్రికి రాత్రే పారిపోయి వచ్చేశాడు. గోవాలో చాలా అప్పు చేశాడు. అక్కడ పనిచేసిన డ్రైవర్‌కి డబ్బులు ఇవ్వలేదు. అతను పబ్‌లో వర్మను చితక బాదాడట. అంతకన్నా ఇంకేం బతుకు. అవసరమా తనకు. డ్రైవర్స్‌కు జీతాలు ఇవ్వలేదని, తిండి పెట్టలేదని డ్రైవర్స్ యూనియన్స్ చెబుతున్నాయి.
ఆర్జీవీ నువ్వు మగాడివైతే ఎక్కడికి రావాలో చెప్పు ఒక్కడిగానే వస్తాను. ఇంటికి రావాలా, ఆఫీసుకి రావాలా ? వస్తాను. నా ఒంటి మీద చెయ్యి వేస్తే నేను నా డబ్బులను వదలుకుంటాను. నాతో ఛాలెంజ్ చేసే మగాడివా నువ్వు. అందరికీ డబ్బులు ఇచ్చి మాట్లాడు. డబ్బులు నువ్వు కడతావా, రామ సత్యనారాయణ కడతాడా.. లేక ప్రసన్న కడతాడా ! ఎవరు ఇస్తారో చెప్పండి. చిరంజీవిగారినో, సురేష్‌బాబుగారినో ఇంకేవరినో నేను వ్యక్తిగతంగా తిట్టలేదు. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు వాటిపై స్పందించాను. పది మందికి పనికొచ్చే పని చేశాను. నీలాగా పనికిమాలిన ట్వీట్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్‌ను అవమానించి, ఆయన్ని అవమానించేలా సినిమా తీసి, చివరకు ఆయన కాళ్లే పట్టుకున్నావు. ఒక సినిమాని ఇద్దరు ముగ్గురికి అమ్ముతున్నావ్. దిశా ఎన్‌కౌంటర్ సినిమాను ఇద్దరికి అమ్మాడు. ఒకరి దగ్గర రూ.56 లక్షలు, మరొకరి దగ్గర రూ.75 లక్షలు తీసుకున్నాడు. అలాగే లడ్‌ఖీ సినిమా మాది. దాన్ని మరొకరికి అమ్మాడు. ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుతూ.. నట్టి కుమార్.. వర్మని ఏకి పారేశాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…