Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకులలో రాజమౌళి తప్పక ఉంటారు. ఆయన తెరకెక్కించే సినిమాలు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతాయి. బాహుబలిని రెండు పార్ట్‌లుగా తెరకెక్కించిన రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రాజమౌళి సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయింది అనేది స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రాజమౌళి నుంచి తర్వాత రాబోయే సినిమా కూడా అంతకు మించి అనేలా ఉంటుంది అని అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి.
ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు రాజమౌళి. మరి వాటిలో బెస్ట్ మూవీ ఏది ? బెస్ట్ ఎపిసోడ్ ఏది ? ఇదే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. దీనికి తన కెరీర్ బెస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ ను చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకైతే ఆర్ఆర్ఆర్ నా కెరీర్ బెస్ట్ సినిమా అనిపిస్తోంది. ఎందుకంటే, నేను ఇంకా ఆర్ఆర్ఆర్ ను ప్రేమిస్తున్నాను. బహుశా.. 6-7 నెలల తర్వాత ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పగలను. అయితే పెర్ఫార్మెన్సుల పరంగా చూసుకుంటే ఇదే నా బెస్ట్ వర్క్. ఆర్ఆర్ఆర్ ప్రభావం మహేష్ సినిమాపై ఉండదంటున్నాడు ఈ దర్శకుడు. ఓ సినిమాను మానసికంగా ఎలా వదిలించుకుంటాడో కూడా చెబుతున్నాడు.
ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత రాజమౌళికి సంబంధించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి. రాజమౌళి సతీమణి రమను గతంలో ఓ చానెల్ వాళ్లు ఇంటర్ప్యూ చేశారు. అయితే ఆ సమయంలో రాజమౌళి ఇంట్లో ఎలా ఉంటారు.. సినిమా ప్రపంచంలోకి వెళితే ఎలా ఉంటారు.. అనే విషయాలను యాంకర్ అడగగా.. అతను చాలా టాలెంట్ అంటూ చెప్పుకొచ్చింది. అదేవిధంగా డబ్బు విషయంలో అస్సలు పట్టించుకోడు.. డబ్బుపైన ఆయనకు అంతగా ఆసక్తి ఉండదు. బయటకు వెళ్లినప్పుడు అతని జేబులో ఒక్క రూపాయి కూడా ఉంచుకోడు.. సడెన్ గా డబ్బు అవసరం ఉంటే కష్టం కదా.. అందుకే రాజమౌళి డ్రైవర్ వద్ద కొంత డబ్బు ఉంచుతానని ఆయన భార్య చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…