RGV fires on Garikapati : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఆయన ఏదో ఒక విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే తాజాగా మరోసారి సంచలన ట్వీట్స్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు ఆర్జీవి. ఈసారి ఆయన గరికిపాటి నరసింహారావుపై ట్విట్టర్ వేదికగా కొన్నికామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి, చిరంజీవిని మధ్య ఓ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతున్న సమయంలో గరికపాటి ఫోటో సెషన్ ఆపేస్తే తాను మాట్లాడుతానని, లేదంటే వెళ్లిపోతానని ఆ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబుతో సహా మెగా అభిమానులు సైతం గరికిపాటిపై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదంపై వివాదాలకు కెరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ స్పందించి చిరంజీవి ఏనుగు.. నువ్వు గరిక.. నీకు పద్మ అవార్డు కూడా ఎక్కువే అంటూ గరికపాటిని ఉద్దేశించి ఘాటుగా విమర్శించాడు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆర్జీవీ నాగబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసి ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు..
మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, తగ్గేదేలే. హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో అంటూ గరికపాటిని విమర్శించారు.
హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి . సర్ నాగబాబు గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు సర్ అని ప్రశ్నించాడు వర్మ. సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి, దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కానీ అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు ఆర్జీవి ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. ఆర్జీవీ గరికిపాటిపై చేసిన ట్విట్టర్ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…