టెలివిజన్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షో గురించి తెలిసిందే. వారం వారం ఎంటర్టైన్మెంట్ ను పెంచుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై కేవలం కామెడీ స్కిట్స్ మాత్రమే కాకుండా.. కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయడం చూస్తున్నాం. వారంవారం కొత్త కాన్సెప్ట్ లతో అలరిస్తున్న ఈ షోలో.. ఈ వారం ఎపిసోడ్ ని హైపర్ ఆది బర్త్ డే స్పెషల్ అంటూ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కొన్నివారాలుగా ఈ షోని యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తుండగా.. నటి ఇంద్రజ ఈ వారం జడ్జిగా వ్యవరించనుంది.
అయితే.. ఈ వారం హైపర్ ఆది తన బర్త్ డే అంటూ స్టేజిపై కామెడీతో పాటు శ్రీరామదాసు సినిమాలోని ఓ పాట పాడి ఆకట్టుకున్నాడు. ఓవైపు నూకరాజుతో కలిసి ఆది పాడిన పాట హైలెట్ అనుకుంటుంటే.. మరోవైపు నెల్లూరు కవిత అని మరో డాన్సర్ ని స్టేజిపైకి తీసుకొచ్చారు. ఈ స్టేజి ద్వారానే గాజువాక కండక్టర్ ఝాన్సీ డాన్సర్ గా మంచి పేరు, గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. స్టేజిపై ఝాన్సీకి పోటీగా చెలరేగిపోయింది నెల్లూరు కవిత. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
మరి ఝాన్సీని మించిన టాలెంట్ అని కవిత ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది ఆదివారం పూర్తి ఎపిసోడ్ లో చూడాల్సిందే. అయితే.. మొన్న గాజువాక నుండి కండక్టర్ ఝాన్సీ.. తాజాగా నెల్లూరు నుండి కవిత.. శ్రీదేవి కంపెనీ స్టేజి ద్వారా మరో సెలబ్రిటీ కావడం ఖాయమేనని అంటున్నారు నెటిజన్స్. అలాగే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు షోని అభినందిస్తున్నా.. స్టేజిపై ఝాన్సీ, కవిత డాన్స్ చేసేటప్పుడు మేల్ కమెడియన్స్ వాళ్ళ దగ్గరకి వెళ్లి హంగామా చేయడం బాలేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ డాన్స్ పెర్ఫామెన్స్ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…