Renu Desai : పవన్ కల్యాణ్‌తో వివాహం అయ్యాక రేణు దేశాయ్ వెండి తెరకు దూరమైంది. తరువాత ఆయన విడాకులు ఇవ్వడం.. ఇంకో పెళ్లి చేసుకోవడం.. ఆపై ఎవరి పనుల్లో వారు బిజీగా అయిపోయారు. ఇక పవన్ నుంచి విడిగా ఉంటున్న రేణు దేశాయ్ గతంలో టీవీ షోల్లో సందడి చేసింది. కానీ ఏమైందో తెలియదు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఆమె టీవీ షోలలో కనిపించడం మానేసింది. అయితే త్వరలోనే ఆమె మళ్లీ వెండి తెరపై మెరవనుంది.

మాస్ మహరాజ రవితేజ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం.. టైగర్ నాగేశ్వర్ రావు. పక్కా మాస్ క్యారెక్టర్‌లో రవితేజ ఇందులో సందడి చేయనున్నారు. అయితే ఈ మూవీలోనే రేణు దేశాయ్ నటించనుంది. దీంతో ఆమె సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే విషయంపై తాను కూడా ఎంతో ఆసక్తితో ఉన్నానని రేణు దేశాయ్ వెల్లడించింది.
టైగర్ నాగేశ్వర్ రావు చిత్ర కథ నచ్చిందని.. అందులో తనకు మంచి పాత్ర లభించిందని.. కనుకనే ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించానని.. రేణు దేశాయ్ గతంలోనే తెలిపింది. ఇక ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమానికి ఈమె హాజరైంది. మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చారు. కానీ పెద్దగా పలకరించుకోనట్లు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా.. అందులో తాను ఎప్పుడెప్పుడు పాల్గొంటానా.. అని.. ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. రేణు దేశాయ్ వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. మరి రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఈ చిత్రంలో ఎలా ఉంటుందో చూడాలి.