Renu Desai : దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న విషయం విదితమే. తాజాగా చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు మరోమారు కరోనా బారిన పడుతున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, త్రిష వంటి నటీనటులకు కరోనా సోకింది. ఈ క్రమంలోనే తాజాగా నటి, దర్శకురాలు రేణు దేశాయ్, ఆమె కుమారుడు అకీరా నందన్‌లు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రేణు స్వయంగా వెల్లడించారు.
తనకు, తన కుమారుడు అకీరా నందన్‌కు కోవిడ్ సోకిందని రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నామని, అయినప్పటికీ కరోనా సోకిందన్నారు. కొన్ని రోజుల నుంచి తమకు కరోనా లక్షణాలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే టెస్టులు చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అన్నారు.
అయితే ప్రస్తుతం తాము కోలుకుంటున్నామని.. తాను ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నానని.. అయినప్పటికీ తనకు కరోనా సోకిందని, అకీరాకు టీకా వేయిద్దాం అనుకుంటున్నామని.. కానీ ఇంతలోపే కోవిడ్ బారిన పడ్డాడని తెలిపారు. కరోనా మూడో వేవ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని.. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని రేణు దేశాయ్ సూచించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…