Bangarraju Movie : అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా.. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. బంగార్రాజు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ మూవీకి చెందిన ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ మూవీ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ తొలి సీన్‌లోనే స్వర్గంలో ఓ దేవకన్య నాగార్జున ఉద్దేశించి మాట్లాడుతూ.. బంగార్రాజు బావగారు చూపులతోనే ఊచకోత కోస్తున్నారు.. అంటుంది. అయితే ఆమె ఎవరు అని ఇప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెదుకుతున్నారు. కానీ ఆమెకు ఈ సినిమా మొదటిది కాదు, ఇది వరకే ఆమె సినిమాల్లో నటించింది. కానీ ఎవరూ ఆమెను గుర్తు పట్టలేదు.
బావగారు చూపులతోనే ఉచకోత కోస్తున్నారు.. అనే డైలాగ్‌ను చెప్పిన ఆ నటి పేరు మీనాక్షి దీక్షిత్. ఈమె 2009లో వచ్చిన జీవనశైలి అనే మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ దూకుడు సినిమాలో టైటిల్ సాంగ్‌లో నటించింది. తమిళ, మళయాళ, కన్నడ వంటి భాషలకు చెందిన మూవీల్లోనూ ఈమె నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు బంగార్రాజు మూవీలో ఒక్క డైలాగ్‌తోనే ఆమె ఫేమ్ అయిపోయింది. ఆమె ఎవరా ? అని ప్రేక్షకులు తెగ ఆరాలు తీస్తున్నారు.
ఇక బంగార్రాజు మూవీలో రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…