Ravi Teja Khiladi Movie Review : రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. ఖిలాడి. ఇందులో అనసూయ, మురళీ శర్మ, ముఖేష్ రుషి, అర్జున్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కోనేరు సత్యానారయణ నిర్మించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారిని ఎలా అలరించిందో.. ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
పూజ (మీనాక్షి చౌదరి) ఒక సైకాలజీ స్టూడెంట్. ఆమె ఇంటెలిజెన్స్ ఐజీ కుమార్తె. ఓ థీసిస్ కోసం సెంట్రల్ జైల్‌లో ఖైదీలను కలుస్తుంటుంది. ఈ క్రమంలోనే జైలులో ఖైదీగా ఉన్న మోహన్ గాంధీ (రవితేజ)ను ఆమె కలుస్తుంది. అయితే మోహన్ అన్నీ ఆమెకు మాయమాటలు చెబుతాడు. దీంతో అవన్నీ నిజమే అని నమ్మిన పూజ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ మోహన్‌కు బెయిల్ వచ్చేట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే జైలు నుంచి బయటకు వచ్చిన మోహన్ తన అసలు రంగు బయట పెడతాడు. అతను ఒక క్రిమినల్ అని పూజకు తెలుస్తుంది. హోం మంత్రికి ఇటలీ నుంచి వచ్చిన రూ.10వేల కోట్లను కొట్టేయడం కోసమే అతను డ్రామా ఆడాడని.. అందుకు గాను తనను పావులా వాడుకున్నాడని.. పూజకు తెలుస్తుంది. దీంతో పూజ ఏం చేసింది ? అసలు ఆ రూ.10వేల కోట్లు ఎవరివి ? ఎక్కడ ఉంటాయి ? మోహన్‌ను మళ్లీ పోలీసులు పట్టుకుంటారా ? అసలు అతని లక్ష్యం ఏమిటి ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. వెండితెరపై ఈ సినిమాను చూడాల్సిందే.
ఇక మూవీలో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రవితేజ డ్యుయల్ షేడ్స్‌లో కనిపించి మరోసారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. అలాగే ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేర నటించారు. సినిమాలో ఉండే ట్విస్టులు ప్రేక్షకులను అలరింపజేస్తాయి. కానీ కొన్ని సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. ఏమాత్రం ఆకట్టుకోవు. కొన్ని సీన్లు అయితే విసుగు తెప్పిస్తాయి. ఇక హీరోయిన్ల అందాల ప్రదర్శన ఒక రేంజ్‌లో ఉంటుంది. ట్రైలర్‌లోనే మసాలా చూపించేశారు. అలాగే పాటలు బాగుంటాయి. ఫైట్స్‌ను కూడా రవితేజకు తగినట్లుగా రూపొందించారు. ఈ క్రమంలో సినిమాను రిచ్ కమర్షియల్ విలువలతో తీసినట్లు స్పష్టమైంది.
అయితే మొత్తంగా చెప్పాలంటే రవితేజ యాక్షన్, హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శన, పాటలు, ఫైట్స్.. వంటి అంశాల కోసం అయితే ఈ మూవీని ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. కథ గురించి పెద్దగా పట్టించుకోకుండా సినిమాను సినిమాలా చూస్తే ఈ మూవీ విజయం సాధించడం పక్కా అని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఈ రెండు రోజులు ప్రేక్షకులు ఇచ్చే తీర్పుపై ఈ మూవీ సక్సెస్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…