Airtel : టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ద్వారా 15 ఓటీటీ యాప్‌లకు చెందిన సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పై నెలకు కేవలం రూ.149కే అందిస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకు గాను కస్టమర్లు ఏడాదికి అయితే రూ.1499 చెల్లించవచ్చు.
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాప్ ద్వారా ఎయిర్‌టెల్ వినియోగదారులు 15 ఓటీటీ యాప్‌లకు చెందిన కంటెంట్‌ను వీక్షించవచ్చు. అందులో భాగంగానే సోనీ లివ్, ఈరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, హోయ్ చోయ్, మనోరమా మ్యాక్స్, షెమారూ, అల్ట్రా, హంగామా ప్లే, ఎపికాన్, డాక్యుబే, దివో టీవీ, క్లిక్, నమ్మ ఫ్లిక్స్, డాలీవుడ్, షార్ట్స్ టీవీ ఓటీటీ యాప్‌లను ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాప్‌లో పొందవచ్చు.
ఇక ఈ యాప్‌లలో ఏకంగా వినియోగదారులు 10,500 మూవీలు, షోలను వీక్షించవచ్చు. అయితే ఈ ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ రావడం లేదు. వాటి కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేక ప్లాన్‌లను అందిస్తోంది.
ఒకటే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 15 ఓటీటీ యాప్‌లకు చెందిన కంటెంట్‌ను వినియోగదారులు సులభంగా పొందవచ్చు. ఇక ఇందుకు గాను నెలకు కేవలం రూ.149 చెల్లిస్తే చాలు. ఈ క్రమంలోనే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సేవలను మొబైల్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లలో పొందవచ్చు.
కొత్తగా ఈ సేవలను ప్రవేశపెట్టడం ద్వారా ఎయిర్ టెల్ మరో 2 కోట్ల సబ్‌స్క్రిప్షన్లను పొందాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ నూతన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…