Rashmika Mandanna : రష్మిక మందన్న సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 5 ఏళ్లకు పైగానే అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తెలుగు, తమిళం, కన్నడ ఇండస్ట్రీలలో పలు వరుస సినిమాల్లో నటించి సక్సెస్ సాధించింది. దీంతో ఆమె నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మారింది. రష్మిక మందన్న తన క్యూట్ లుక్స్, గ్లామర్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పుష్ప – ది రైజ్ చిత్రం రష్మికకు చక్కని బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇందులో శ్రీవల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా రష్మికకు కూడా మంచి హిట్‌ను, పేరును తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాలోని సామి సామి పాటలో రష్మిక డ్యాన్స్ స్టెప్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
రష్మిక వేసిన సామి సామి ఐకానిక్ స్టెప్‌ను చాలా మంది వేసి తమ సరదా తీర్చుకుంటున్నారు. ఇక రష్మిక ఎల్లప్పుడూ గ్లామర్‌గా ఉంటుంది. అందుకుగాను ఆమె కఠినమైన ఫిట్‌నెస్ నియమాలను పాటిస్తుంది. ఈమె తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ రహస్యాన్ని, తన గ్లామర్ వెనుక ఉన్న సీక్రెట్స్‌ను తెలియజేసింది.
తాను రోజూ కచ్చితంగా వ్యాయామం చేస్తానని.. అన్ని పోషకాలు ఉండే ఆహారాలను తీసుకుంటానని.. రష్మిక మందన్న తెలియజేసింది. వ్యాయామం చేయడం ఒక్కటే కాదు, శారీరకంగా, మానసికంగా దృఢంగా, బలంగా ఉండాలంటే.. డైట్ కూడా ముఖ్యమేనని.. సరైన ఆహారం తీసుకుంటేనే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటామని.. ఆహారం విషయంలో తాను కఠినమైన నియమాలను పాటిస్తానని తెలిపింది. అంటే ఈమె డైట్ ఎంత కఠినంగా పాటిస్తుందో స్పష్టమవుతుంది. అందుకనే ఆమె అంత గ్లామర్‌గా ఉంటుందని చెప్పవచ్చు.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప రెండో పార్ట్‌లో నటిస్తుండగా.. శర్వానంద్‌తో కలిసి నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా త్వరలో విడుదల కానుంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన మిషన్ మజ్ను అనే బాలీవుడ్ సినిమాతోపాటు గుడ్ బై అనే మరో మూవీలోనూ రష్మిక నటిస్తోంది. ఈ మూవీలు కూడా రానున్న నెలల్లో విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…