Garikapati Narasimha Rao : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రం.. పుష్ప. ఈ సినిమా అనేక మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే త్వరలో ఈ మూవీకి రెండో పార్ట్‌ను తెరకెక్కించనున్నారు. అయితే ఈ మూవీని ఎందరు పొగుడుతున్నారో.. అందరు విమర్శిస్తున్నారు. విమర్శిస్తున్నవారిలో ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి ఒకరు.
సహస్ర అవధాని గరికపాటి నరసింహా రావు తాజాగా పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్, సుకుమార్‌లను ఆయన ఏకిపారేశారు. ఆ ఇద్దరూ తన దగ్గరకు వస్తే కడిగి పారేస్తానని అన్నారు. ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారని ప్రశ్నించారు. స్మగ్లింగ్‌ను ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందని.. దీన్ని చూసి సమాజంలో మనుషులు చెడిపోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు.
స్మగ్లింగ్‌ను, రౌడీయిజాన్ని ప్రోత్సహించడం.. రోడ్డు మీద పోయేవాళ్లను చెంప దెబ్బ కొట్టి తగ్గేదేలే.. అనడం ఎంత వరకు కరెక్ట్ అని అన్నారు. రాముడు, హరిశ్చంద్రుడు లాంటి వారు అలాంటి డైలాగ్‌లు వాడాలి కానీ.. స్మగ్లర్లు ఎలా వాడుతారని.. అలాంటి వారిని ప్రోత్సహిస్తూ అసలు సినిమాలు ఎలా తీస్తారని గరికపాటి ప్రశ్నించారు.
ఇక ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు ర్యాంకులు రావాలని ఆశిస్తున్న తల్లిదండ్రుల మనస్తత్వంపై కూడా ఆయన విమర్శలు చేశారు. తమ పిల్లలు అబద్దాలు చెప్పినా ఫర్వాలేదు కానీ వారికి ర్యాంకులు మాత్రం రావాలని ప్రస్తుతం తల్లిదండ్రులు కోరుకుంటున్నారని.. అలాంటి తల్లిదండ్రులు పిల్లలు సన్మార్గంలో ఎలా నడిపిస్తారని అన్నారు. పిల్లలకు కావల్సింది ర్యాంకులు కాదని, మంచి ప్రవర్తన, నీతి నిజాయితీ, సంస్కారం ఉండాలని.. వాటిని పిల్లలకు నేర్పాలని హితవు పలికారు.
కాగా గరికపాటికి ఇటీవలే కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం విదితమే. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా మాట్లాడారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…