Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ ఎవరు అని అడిగితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు రష్మిక. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక మందన్న వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. ఛలో అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి గీత గోవిందం చిత్రం సక్సెస్ తో అవకాశాలు దక్కించుకుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ రేంజ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయింది.
పుష్ప చిత్రం సక్సెస్ తో నార్త్ ను ఏలేస్తున్న రష్మిక బాలీవుడ్ లో భారీ ఆఫర్ ను పట్టేసినట్లు తెలిసింది. జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు గత కొంత కాలంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి స్క్రూ డీలర్ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా అఫిషియల్ గా కూడా ప్రకటించారు. దీంతో ప్రేక్షకుల్లో రష్మిక నెక్స్ట్ ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి గల కారణం రష్మిక మందన్న తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి గాను హీరో టైగర్ ష్రాఫ్ రెమ్యూనరేషన్ రూ.35 కోట్లు డిమాండ్ చేశాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నిర్మాత కరణ్ జోహార్ రెమ్యూనరేషన్ ని తగ్గించుకోవాలని టైగర్ ష్రాఫ్ ని స్పెషల్ రిక్వెస్ట్ చేశారట. ముందుగా రూ.20 కోట్లు తీసుకొని సినిమా విడుదల తరువాత లాభాల్లో షేర్ తీసుకోమని కోరగా టైగర్ అందుకు నో చెప్పాడని వార్త వినిపిస్తోంది.
ఆ సినిమా ఆగిపోవడానికి ఇదొక కారణమైతే.. మరొక కారణం రష్మిక మందన్న ఈ చిత్రం కోసం డేట్స్ ను లేటుగా అడ్జస్ట్ చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందిపుచ్చుకోవడంతో కాల్ షీట్స్‌ను అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక ఈ చిత్రాన్ని చేయడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టవచ్చని కరణ్ జోహార్ ఈ సినిమాను నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బాలీవుడ్‌లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న రష్మికకు ఈ చిత్రం ఆగిపోవడంతో గట్టి షాక్ తగిలింది అంటూ వార్తలు వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…