Liger Movie : లైగర్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిందనే చెప్పవచ్చు. దాదాపుగా రూ.120 కోట్లకు పైగానే బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలు భారీ నష్టాలను చూసేలా చేసింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ పాత్రను కూడా నవ్వుల పాలు చేశారని విమర్శలు వస్తున్నాయి. పూరీ జగన్నాథ్ ఇంకా ఛార్మీల నిర్మాణ భాగస్వామ్యంలో కరణ్ జోహార్ సహకారంతో బాలీవుడ్ లో కూడా ఆగస్టు 25న విడుదలైన సినిమా లైగర్. రిలీజైన రోజు రెండవ ఆట నుండే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 5 రోజుల వసూళ్ల పరంగా చూసుకున్నట్లయితే, కేవలం రూ.25.14 కోట్ల షేర్ ను మాత్రమే సాధించిందని తెలుస్తోంది. ఇక వివిధ ప్రాంతాల పరంగా పరిశీలించినట్లయితే, ఈ చిత్రం నైజాంలో రూ.5.62 కోట్లు, సీడెడ్ రూ.1.83 కోట్లు, ఆంధ్రలో రూ.5.36 కోట్లు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ లో కలిపి రూ.12.81 కోట్ల షేర్ అలాగే రూ.21.80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
ఇక ఇండియాలో హిందీ ఇంకా ఇతర భాషలలో కలిపి చూసుకున్నట్లయితే ఈ సినిమా రూ.8.99 కోట్లు, అలాగే ఇతర దేశాలలో రూ.3.34 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక 5 రోజులలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.25.14 కోట్ల షేర్ అలాగే రూ.52.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను చేరుకుంది. అయినప్పటికీ ఈ సినిమా నిర్మాతలకి ఇంకా రూ.60 నుండి రూ.70 కోట్ల నష్టాలను మిగిలిస్తుందని భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…