Rashmika Mandanna : కన్నడలో రిలీజ్ అయిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా రష్మిక మందన్న సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తరువాత తెలుగులో ఛలో అనే సినిమాలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇక ఆమె కెరీర్ మలుపు తిరిగింది. తరువాత ఎన్నో సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ క్లబ్‌లోకి చేరుకుంది. నేషనల్ క్రష్‌గా కూడా మారింది.
గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్ చిత్రాలతో రష్మిక మందన్న గ్రాఫ్ అమాంతం పెరిగింది. తాజాగా పుష్ప సినిమాతో ఆమె కెరీర్ మరింత ఎత్తుకు వెళ్లింది. దీంతో బాలీవుడ్‌లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో అనేక మంది రష్మిక మందన్నతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారట. పుష్ప సినిమా ద్వారా వచ్చిన గుర్తింపుతో రష్మిక మందన్న ప్రస్తుతం బిజీ అయిపోయింది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రష్మికకు బాలీవుడ్‌లో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకడైన కరణ్ జోహార్ ఆమెకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే రష్మిక ముంబైలో కరణ్ జోహార్ ఆఫీస్ వద్ద కనిపించింది. దీంతో ఆమె తదుపరి సినిమా కోసం చర్చించేందుకే అక్కడకు వెళ్లిందని, ఆమెకు స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరణ్ జోహార్‌కు బాలీవుడ్‌లో ఉన్న పేరు దృష్ట్యా ఆమెకు భారీగానే ఆఫర్ వచ్చిందని సమాచారం. ఓ అగ్రహీరో సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే రష్మిక మందన్న ఈ వార్తలపై స్పందించలేదు. కానీ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. అదే నిజమైతే రష్మిక దశ తిరిగిపోయిందనే చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…