Rashmika Mandanna : పుష్ప సినిమాతో రష్మిక మందన్న స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతకు ముందే కొన్ని హిందీ సినిమాలకు ఒప్పుకున్నా.. పుష్ప సినిమాతో ఆమె డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇటు హిందీతోపాటు అటు తమిళంలోనూ.. తెలుగులోనూ ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈమె ప్రస్తుతం ముంబైలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. బాలీవుడ్ సినిమాల షూటింగ్‌లు ఉన్నప్పుడల్లా ఈ భామ ముంబైకి వెళ్తూ తరువాత హైదరాబాద్‌కు వస్తోంది. ఇక మరోవైపు పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ బిజీగా మారింది.
అయితే రష్మిక మందన్న సినిమాల్లోనే కాదు.. సాధారణంగానే గ్లామర్ షో చేస్తుంటుంది. ఇక ఆమె కొన్ని మ్యాగజైన్లకు కవర్ ఫొటోలకు ఫొటోషూట్స్ చేసింది. అవి గతంలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మరోమారు ఇంకో మ్యాగజైన్‌కు ఫొటోషూట్ చేసింది. అందులో నారింజ రంగు టాప్, వైట్ కలర్ బాటమ్ ధరించి అదరగొట్టింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ రష్మిక మందన్న చేసిన గ్లామర్ షోకు యువత ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక మందన్న ప్రస్తుతం హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి రెండూ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయి. అలాగే తెలుగులో సీతారామమ్, పుష్ప 2, తమిళంలో విజయ్ 66వ మూవీలో, హిందీలో యానిమల్ అనే మూవీలోనూ ఈమె నటిస్తోంది. ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం రష్మిక మందన్న పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోనుంది.