Rashmika Mandanna : రష్మిక మందన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చి 5 ఏళ్లకు పైగానే అవుతోంది. ఈ క్రమంలోనే ఈమె నేషనల్ క్రష్‌గా కూడా మారింది. కన్నడ సినిమా కిరిక్ పార్టీతో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ నటిగా అనతికాలంలోనే గుర్తింపు పొందింది. అలాగే తెలుగులోనూ పలువురు అగ్ర హీరోల సరసన నటించి ఆకట్టుకుంది.
అయితే పుష్ప సినిమా తరువాత రష్మికకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్‌లో అందాలను ఆరబోసింది. రష్మిక మందన్న బ్లూ లెహెంగా ధరించి టాప్ మధ్య భాగం చూపిస్తూ కేక పెట్టిస్తోంది.
రష్మిక ధరించిన ఈ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఇందులో రష్మిక ఎంతో గ్లామర్‌గా కనిపిస్తోంది. టాప్ మధ్య భాగంలో అందాలను చూపిస్తూ అలరిస్తోంది.
ఇక రష్మిక తన తరువాతి చిత్రం ఆడాళ్లు మీకు జోహార్లులో కనిపించనుంది. త్వరలోనే పుష్ప సెకండ్ పార్ట్‌లోనూ నటించనుంది.