Rashmika Mandanna : ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. ప్రజలు దీపావళి పండుగను అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వారు తమ దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్న కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 17న విడుదల కానుంది. అందులో నుంచి విడుదలైన సామి సామి అనే పాటకు విశేష రీతిలో స్పందన లభిస్తోంది. అయితే దీపావళి సందర్భంగా రష్మిక షేర్ చేసిన తన ఫొటోలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తన క్యూట్ లుక్స్‌తో రష్మిక ఎంతో అద్భుతంగా ఈ ఫోటోల్లో కనిపించి సందడి చేస్తోంది.