Rashmi Gautam : బుల్లి తెర నటి, యాంకర్ రష్మి గౌతమ్ మూగజీవాల పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. వాటికి ఏమైనా అయితే ఆమె తట్టుకోలేదు. ఆమె ఎప్పుడూ జంతు సంరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనపై రష్మి గౌతమ్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ నీటి ఏనుగు ఉంది. దాన్ని రోజూ చాలా మంది సందర్శకులు చూస్తుంటారు. అయితే ఇటీవల ఆ నీటి ఏనుగు తన కేజ్ నుంచి తలను బయటకు పెట్టి చూస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దాన్ని లోపలికి పంపించేందుకు తలపై కొట్టాడు.
ఈ క్రమంలో ఆ సంఘటనను ఓ నెటిజన్ వీడియో తీసి దాన్ని షేర్ చేశాడు. అయితే ఆ వీడియో చూసిన రష్మి ఆగ్రహానికి గురైంది. జంతువుల పట్ల జూ సిబ్బంది వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, ఇది బాధాకరమైన విషయమని పేర్కొంది. కాగా లాక్ డౌన్ సమయంలో తాము ఇంట్లో మూడు నెలలు ఉండేందుకు ఇబ్బందులు పడ్డామని, అలాంటిది వాటిని అలా బంధించి ఉంచితే వాటికి ఎంత బాధ కలుగుతుందో చెప్పలేమని.. రష్మి తెలిపింది. ఈ క్రమంలోనే జూ ను నిషేధించాలి.. అని ఆంగ్లంలో హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె జత చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…