83 Movie : బయోపిక్‌లు అంటే సహజంగానే ప్రేక్షకులు ఆ తరహా సినిమాలను ఆదరిస్తుంటారు. ఒకటి రెండు సినిమాలు తప్ప చాలా వరకు బయోపిక్‌లు బ్లాక్ బస్టర్ హిట్లుగానే నిలిచాయి. ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 83 మూవీ కూడా ప్రేక్షకులను అలరించింది.
83 మూవీలో కపిల్‌దేవ్ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషించారు. కపిల్ భార్యగా రణ్ వీర్ సరసన దీపికా పదుకొనె నటించారు. కబీర్‌ఖాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ విదేశాల్లోనూ చక్కని వసూళ్లను రాబట్టింది.
అయితే ఈ మూవీ విడుదలయ్యే సమయానికి కరోనా కేసులు పెరుగుతుండడం, పలు చోట్ల థియేటర్లు మూసి ఉండడం, కొన్ని చోట్ల ఆంక్షలు ఉండడంతో చిత్ర కలెక్షన్లపై ఆ ప్రభావం పడింది. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే ఈ మూవీ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. ఇక ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.
ప్రముఖ ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ 83 సినిమా డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌తోపాటు హాట్ స్టార్‌లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
1983లో కపిల్ దేవ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు టీమిండియా సాధించిన వరల్డ్ కప్ కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…