Rashmi Gautam : బుల్లితెరపై చాలా మంది ప్రేక్షకులను అలరిస్తున్న షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ షోకు ప్రస్తుతం ఆదరణ తగ్గింది. దీంతో నిర్వాహకులు చీప్ ట్రిక్స్ ప్లే చేసి రేటింగ్స్ రాబట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ షో నుంచి చాలా మంది బయటకు వచ్చేశారు. దీంతో జబర్దస్త్‌కు కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. అయితే జబర్దస్త్‌లో అనసూయ మొదట్లో వెళ్లిన అనంతరం నుంచి రష్మి గౌతమ్ ఇప్పటి వరకు ఇంకా ఇందులో యాంకర్‌గానే కొనసాగుతోంది. ఈమె పలు సినిమాల్లో చేసినప్పటికీ నిరంతరాయంగా ఈ షోలో మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇక రష్మిగౌతమ్‌కు చెందిన పాత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఆమె పలు కీలక విషయాలను వెల్లడించింది.
జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య నడిచే లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు తమ మధ్య ఏమీ లేదని.. కేవలం షో కోసమే అలా చేస్తున్నామని ఎన్నో సార్లు చెప్పారు. కానీ వీరి మధ్య ఏదో నడుస్తుందని.. ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే అప్పట్లో తనకు చలాకి చంటితోనూ ఎఫైర్ అంటగట్టారని.. ఈ వార్తలు ప్రచారం అవుతుంటే చూసి తట్టుకోలేకపోయానని రష్మిగౌతమ్ తెలియజేసింది. ఇక జబర్దస్త్‌లో అందరూ ఎంతో కష్టపడతారని.. స్కిట్లను చేసేందుకు వారు శ్రమిస్తారని.. అన్ని టీమ్‌లు అంటే తనకు ఇష్టమేనని రష్మి తెలిపింది.

అయితే షో సందర్భంగా తనపై జోకులు వేస్తే మొదట్లో కోపం వచ్చేదని.. కానీ రాను రాను అలవాటు అయిపోయిందని.. ఇప్పుడు జోకులు వేసినా పెద్దగా సీరియస్ అవడం లేదని.. లైట్‌గానే తీసుకుంటున్నానని రష్మి గౌతమ్ తెలిపింది. ఇక జబర్దస్త్ పై అసభ్యకరమైన షోగా ముద్ర పడిందని.. కానీ ప్రేక్షకులు చాలా మంది చూస్తున్నారని.. ఇందులో అడల్ట్ కంటెంట్ ఉంటుందని అనుకుంటున్నారని.. అయితే వాస్తవానికి ఈ షో పెద్దలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తుందని.. రష్మిగౌతమ్ క్లారిటీ ఇచ్చింది. అయితే పాత వీడియో అయినప్పటికీ రష్మిగౌతమ్‌కు చెందిన ఈ ఇంటర్వ్యూ వీడియోను సదరు చానల్ వారు మళ్లీ షేర్ చేశారు. దీంతో ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది.