గత కొంత కాలంగా మల్లెమాల వారి జబర్దస్త్ కార్యక్రమం ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొంటోంది. స్టార్ కమెడియన్లు దూరం కావడంతో ఈ షోకు రేటింగ్స్ బాగానే పడిపోయాయి. మరోవైపు రోజా వెళ్లిపోవడం, ఆ తరువాత మరికొందరు కమెడియన్లు కూడా దూరం అవడంతో.. షో కు ఆదరణ తగ్గిపోయింది. ఇక జబర్దస్త్‌కు యాంకర్ అనసూయ కూడా గుడ్ బై చెప్పేసింది. ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తుండడంతో జబర్దస్త్‌కు డేట్స్‌ను అడ్జస్ట్ చేయలేకపోతున్నానని చెబుతూ కన్నీటి వీడ్కోలు తీసుకుంది. అయితే జబర్దస్త్‌లో అనసూయ తరువాత కొత్తగా ఎవరు యాంకర్‌గా వస్తారోనని ఇన్ని రోజుల పాటు సస్పెన్స్ నెలకొంది. కానీ ఎట్టకేలకు సస్పెన్స్ వీడిపోయింది. కొత్త యాంకర్ ఎవరు అన్నది బయట పెట్టేశారు.
జబర్దస్త్‌కు అనసూయ అనంతరం మంజూష యాంకర్‌గా వస్తుందని జోరుగా ప్రచారం చేశారు. ఈ మేరకు వార్తలు హల్ చల్ చేశాయి కూడా. అయితే అకస్మాత్తుగా రష్మి గౌతమ్‌నే మళ్లీ జబర్దస్త్‌కు కూడా యాంకర్‌గా తెచ్చారు. గత వారం విడుదలైన ప్రోమోలో పల్లకిలో కొత్త యాంకర్‌ను మోసుకువచ్చారు. దీంతో ఆమె మంజూషనే అయి ఉంటుందని అనుకున్నారు. కానీ కాదు. యాంకర్ రష్మినే జబర్దస్త్‌కు కూడా యాంకర్‌గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే వాస్తవానికి గతంలో అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా కొంత కాలం పాటు రష్మినే రెండు కార్యక్రమాలకు యాంకర్‌గా కొనసాగింది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్.. ఇలా రెండింటికీ ఆమెనే యాంకర్‌గా చేసింది. ఆ తరువాత అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు మళ్లీ జబర్దస్త్‌లో యాంకర్‌గా అవకాశం ఇచ్చారు. దీంతో రష్మి ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కే పరిమితం అయింది. అయితే ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ బాధ్యతలను తీసుకుంది. దీంతో ఆమె మళ్లీ రెండు షోలకూ యాంకర్‌గా కొనసాగనుంది.
ఇక మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రష్మినే యాంకర్‌గా ఉంది. దీంతో మొత్తంగా వారి భవిష్యత్తు అంతా రష్మి చేతుల్లోనే ఉందన్నమాట. మరి ఈ అమ్మడు ఇప్పుడు ఈ మూడు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ షోకు ఎలాంటి రేటింగ్స్ తెప్పిస్తుందో చూడాలి. చాలా మంది దూరం అయిన నేపథ్యంలో జబర్దస్త్ షోస్ ఇకపై ఎలా కొనసాగుతాయో కూడా చూడాలి. ఈ రిజల్ట్ రానున్న రోజుల్లో తేలనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…