టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈమె వల్ల అప్పట్లో టాలీవుడ్ ప్రముఖులు వణికిపోయారు. అయితే ఆ వివాదం సద్దుమణిగింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తూ ఉంటుంది. అలాగే తరచూ తన గ్లామరస్ ఫొటోలను, వీడియోలను ఆమె అందులో షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఇక ఈమె పెట్టే పోస్టులు కూడా ఎల్లప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయి. అయితే గత కొంత కాలంగా శ్రీరెడ్డి మాత్రం వివాదాలకు దూరంగా ఉంటూ వస్తోంది. తన యూట్యూబ్ చానల్‌లో వంటల వీడియోలను పోస్ట్ చేస్తోంది.
శ్రీరెడ్డి తన యూట్యూబ్ చానల్‌లో ఎప్పుడెప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తుందా.. అని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా మరోమారు ఆమె మరో వీడియోతో మన ముందుకు వచ్చింది. ఆమె లేటెస్ట్‌గా పాంప్లెట్స్ చేపల కూర వండింది. ఈ క్రమంలోనే తన అందాలను ఆరబోస్తూ వంట చేస్తూ ఉంటే యువతకు మతులు పోతున్నాయి. తనదైన శైలిలో డైలాగ్స్ వాడుతూ శ్రీరెడ్డి ఈ చేపల కూర వండింది. ఆమె వంటిన ఈ కూరను చూస్తుంటే నోరూరిపోతుందని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీరెడ్డి తన చేపల కూరతో మళ్లీ అదరగొట్టింది. ఈమె చేసిన కూరను తింటే నిజంగా వావ్ అనాల్సిందే. అలాంటి లుక్‌ను ఆ కూర కలిగి ఉంది. ఇక సోషల్ మీడియాలో శ్రీరెడ్డి గత కొంత కాలంగా వివాదాస్పద పోస్టులు ఏమీ పెట్టడం లేదు. ఎవరినీ విమర్శించడం లేదు. తన చానల్ పని తాను చూసుకుంటోంది. టాలీవుడ్‌లో ఈమెకు అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం చెన్నైలోనే మకాం వేసింది. అప్పుడప్పుడు అక్కడి చానల్స్‌కు చెందిన ప్రోగ్రామ్‌లలోనూ ఈమె పాల్గొంటూ వస్తోంది.
శ్రీరెడ్డి గత మార్చి నెలలో నాగబాబు కుమార్తె నిహారికను తీవ్రంగా విమర్శించింది. తరువాత కరాటే కల్యాణికి వార్నింగ్ ఇచ్చింది. యూట్యూబర్ శ్రీకాంత్ కు సపోర్ట్‌ను అందించింది. ఆ తరువాత మళ్లీ ఎలాంటి వివాదాల జోలికి కూడా ఈమె వెళ్లలేదు. చూస్తుంటే శ్రీరెడ్డి సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇలా ఎందుకు మారిపోయిందన్న విషయమే అర్థం కావడం లేదు. మరి దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…